Top News

RDO in SIR | బాన్సువాడ 18వ వార్డులో ఓటర్ నమోదుపై ప్రత్యేక అవగాహన

బాన్సువాడ 18వ వార్డులో ఓటర్ నమోదుపై ప్రత్యేక అవగాహన 

 ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని RDO రవీందర్ రెడ్డి ఆదేశం

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ :బాన్సువాడ పట్టణంలోని 18వ వార్డు పాత అంగడి బజార్, ఇస్లాంపుర కాలనీలో ఓటర్ నమోదుపై బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి  ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎజాజ్, మాజీ కో ఆప్షన్ మెంబర్ పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ నమోదు ప్రాముఖ్యత గురించి ప్రజలకు వివరించారు.

ప్రతి ఒక్కరి ఓటు నమోదు కావాలి  

ఈ సందర్భంగా RDO రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, 18వ వార్డులోని ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యే విధంగా BLOలు బాధ్యతతో పనిచేయాలని అన్నారు. కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వయంగా ఓటర్ నమోదు పత్రాలను నమోదు చేయిస్తున్నామని తెలిపారు.

ఎన్యుమరేషన్ ఫారాలను BLOలు పూర్తిగా, సరిగ్గా నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ నమోదు చేసుకోవాలని, ఈ ప్రక్రియలో కాలనీ వాసులు అధికారులకు సహకరించాలని కోరారు.

ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, BLOలు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post