ఎం.సి.హెచ్ బాన్సువాడలో వైద్య సిబ్బంది రెండో రోజూ నిరసన
సస్పెండ్ అయిన నర్సులకు మద్దతుగా డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ ఆందోళన
బాన్సువాడ: మాతా శిశు ఆసుపత్రి బాన్సువాడలో సస్పెండ్ అయిన ఇద్దరు నర్సులకు మద్దతుగా వైద్యులు, వైద్య సిబ్బంది రెండో రోజు కూడా నిరసన చేపట్టారు.
ఈరోజు ఆసుపత్రి ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలత, డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ, బాలింతల కేసులో ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడాన్ని, మత్తు మందు వైద్యుడిని తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
(డాక్టర్ల విన్నపం వీడియో 👇)
"ఒకవేళ తప్పు జరిగితే మొదట మెమో ఇవ్వాలి. నేరుగా సస్పెండ్ చేయడం, తొలగించడం సరికాదు. ఈ చర్యల వల్ల సిబ్బంది మనోధైర్యం దెబ్బతింటుంది" అని వారు అన్నారు.
ఏరియా ఆసుపత్రికి అనేక మండలాల నుండి రోగులు వచ్చి మెరుగైన చికిత్స పొందుతున్నారని, డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించాలని కోరారు.
స్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని, తొలగించిన మత్తు వైద్యుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, సిబ్బందిపై తీసుకున్న చర్యలను వెంటనే సమీక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీలత, ప్రకాష్, సాయిలు, శ్వేత, ప్రవీణ్, సంతోష్ కుమార్ తో పాటు పారామెడికల్ సిబ్బంది సాగర్, హిమాయత్, మహేష్, హెడ్ నర్స్ అమృత తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق