Top News

Shabbir Ali | కామారెడ్డిలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

కామారెడ్డిలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు  

నరసన్నపల్లి సర్పంచ్ రసమోల్ల రవి సహా 20 మంది, యువకులు 70 మంది చేరిక  

ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ  

కామారెడ్డి, తెలంగాణ డైలీ న్యూస్: 

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ స్థాయిలో చేరికలు కొనసాగుతున్నాయి. నరసన్నపల్లి సర్పంచ్ నేతృత్వంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరగా, బీఆర్ఎస్, బీజేపీల నుంచి 70 మంది యువకులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.  

నరసన్నపల్లి నుంచి 20 మంది చేరిక  

కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ సర్పంచ్ రసమోల్ల రవి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  

ఈ సందర్భంగా ఆలే శ్రీకాంత్, రసమోల్ల భూమయ్య, చందన స్వామి, చందన చంద్రం, రసమోల్ల రాజయ్య, ధ్యాప చిన్న అంజయ్య, పిట్టల నర్సింలు, ఆలే రాజయ్య, రసమోల్ల స్వామి, ధ్యాప రవి తదితరులు సహా సుమారు 20 మంది పార్టీలో చేరారు.  

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని షబ్బీర్ అలీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని, అందుకే అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చారు.  


70 మంది యువకుల చేరిక  

కామారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు యువ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బాణాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 40 మంది, బీఆర్ఎస్ నుంచి వంశి యాదవ్ ఆధ్వర్యంలో 30 మంది యువకులు పార్టీలో చేరారు.  

శివకుమార్, నిఖిల్, జైపాల్, సాయిరాజ్, నీరజ్, విష్ణు, కన్నా, సాయి, లక్ష్మణ్, శ్రీశాంత్, అనురాగ్, అబ్భు, రామ్ యాదవ్, నిక్కి రాయి, కౌశిక్, ప్రభాస్, ప్రశాంత్, కళ్యాణ్, సతీష్, గణేష్, పండు, శ్రీ సాయి, నందు, రాము, భాను తదితరులు సహా మొత్తం 70 మంది యువకులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు.  

రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి అనేక ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పక్కనపెట్టి విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి, సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.  



ప్రమాద బాధితులకు తక్షణ సహాయం  

ఆదివారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో బిక్నూర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన షబ్బీర్ అలీ వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన వారి వద్దకు వెళ్లి పరిస్థితిని తెలుసుకుని, అంబులెన్స్‌ను సమకూర్చి అత్యవసర వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించే వరకు అక్కడే ఉండి అధికారులు, వైద్య సిబ్బందితో సమన్వయం చేశారు.  

"ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. మానవత్వం కంటే గొప్పది మరొకటి లేదు" అని షబ్బీర్ అలీ అన్నారు.  అంతకు ముందు పలు వివాహ వేడుకల్లో షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన నాయకులు మహమ్మద్ ఇలియాస్, కామారెడ్డి మండల అధ్యక్షులు రాజా గౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, యువజన కాంగ్రెస్ నాయకులు హనుమాన్ల, రామ్ కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూమని బాలరాజ్, రెడ్డి నాయక్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, ఇప్ప శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post