Top News

Theft Case | ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

నిజాంసాగర్ కాటేజీల్లో రూ.1.75 లక్షల చోరీ కేసు ఛేదన  

ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్  

సాంకేతిక ఆధారాలతో చోరీ సొత్తు, కారు స్వాధీనం

బాన్సువాడ : నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రూ.1.75 లక్షల విలువైన చోరీ కేసును పోలీసులు సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ దర్యాప్తుతో ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు:

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ గ్రామ శివారు, గోల్ బంగ్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగింది. కాటేజీ సూపర్వైజర్ అందె మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా కాటేజీల్లో గతంలో పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ఆన్‌లైన్ బెట్టింగ్, మద్యానికి బానిసలై ఉద్యోగాలు కోల్పోయినట్లు తేలింది. తమను ఉద్యోగం నుంచి తొలగించిన సంస్థ MD దీపక్ పై కక్ష పెంచుకుని మారుతి రిట్జ్ కారులో పటాన్‌చెరువు నుంచి అచ్చంపేట్‌కు వచ్చారు. ఎవరూ లేని సమయంలో గది తాళాన్ని రాయితో పగులగొట్టి లోపలికి ప్రవేశించి రెండు కట్టర్లు, రెండు వెల్డింగ్ మిషన్లు, ఒక WUKO CLIPPER బాక్స్ సహా మొత్తం రూ.1,75,000/- విలువైన వస్తువులు చోరీ చేసి తీసుకెళ్లారు.

అరెస్ట్ అయిన వారు  :

బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో, బాన్స్వాడ రూరల్ CI ఎ. తిరుపయ్య టెక్నికల్ డేటా, ఇతర ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు.

1.  A1: గట్టు రాకేష్, 29, భూపాలపల్లి జిల్లా, తెలంగాణ

2.  A2: తమ్మినేని లక్ష్మణ్ రావు @ శివ, 25, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

- రెండు కట్టర్లు  

- రెండు వెల్డింగ్ మిషన్లు  

- ఒక WUKO CLIPPER బాక్స్  

- మారుతి రిట్జ్ కారు (AP09CM6006)  

- రెండు మొబైల్ ఫోన్లు  

మొత్తం రూ.1.75 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసి నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.

ఎస్పీ అభినందనలు 

సాంకేతిక ఆధారాలతో కేసును వేగంగా ఛేదించిన బాన్స్వాడ రూరల్ CI ఎ. తిరుపయ్య, నిజాంసాగర్ SI జె. శివకుమార్, టెక్నికల్ టీమ్ మరియు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

أحدث أقدم