Top News

Ward No. 13 | వేగంగా కొనసాగుతున్న SIR ఎన్యుమరేషన్ ఫారం నింపే ప్రక్రియ

వేగంగా కొనసాగుతున్న SIR ఎన్యుమరేషన్ ఫారం నింపే ప్రక్రియ  

ఓటర్లకు సహాయంగా నాయకులు, BLAలు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా SIR ఎన్యుమరేషన్ ఫారం నింపి తిరిగి సేకరించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలో ఈ ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తున్నారు.

బూత్ స్థాయిలో సమన్వయం

వార్డు నెంబర్ 13, బూత్ నెంబర్ 227 BLO  వాణికి సహాయంగా బూత్ ఏజెంట్ BLA 227, మున్సిపల్ కో ఆప్షన్ ఖమర్ సుల్తానా గౌస్ పనిచేస్తున్నారు. 

BLOకు సహాయంగా ఓటర్ల మధ్య సమన్వయం చేస్తూ, ఫారంలో తప్పులు జరగకుండా ఓటర్లు ఇచ్చిన వివరాలు, మ్యాపింగ్ అయిన వివరాలను క్లుప్తంగా పరిశీలించి నింపుతున్నారు. నింపిన ఫారాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియను కూడా చేపడుతున్నారు.

అర్హుల ఓటును కాపాడడమే లక్ష్యం

ఈ సందర్భంగా BLA 227 & మున్సిపల్ కో ఆప్షన్ ఖమర్ సుల్తానా గౌస్ మాట్లాడుతూ బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సంకల్పం మేరకు అర్హులైన ప్రతి ఓటును కాపాడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

SIR ఎన్యుమరేషన్ ఫారం ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటు హక్కును కాపాడేందుకు BLAలు, నాయకులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.




Post a Comment

Previous Post Next Post