Top News

YSR Jayanti | వై.ఎస్.ఆర్ జయంతి: బంజారాహిల్స్‌లో ఘన నివాళులు

వై.ఎస్.ఆర్ జయంతి: బంజారాహిల్స్‌లో ఘన నివాళులు  

షబ్బీర్ అలీ పూలమాల వేసి నివాళులర్పణ

తెలంగాణ డైలీ న్యూస్,  హైదరాబాద్: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  జయంతి సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని ఆయన విగ్రహం వద్ద నివాళుల కార్యక్రమం ఘనంగా జరిగింది.

షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో నివాళులు  

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు  షబ్బీర్ అలీ వై.ఎస్.ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వై.ఎస్.ఆర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ప్రజాసేవే నిజమైన నివాళి 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వై.ఎస్.ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని పేర్కొన్నారు. రైతులు, పేదలు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.  

"వై.ఎస్.ఆర్  ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి" అని షబ్బీర్ అలీ తో పాటు పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు కూడా వై.ఎస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.




Post a Comment

Previous Post Next Post