Top News

Accidents | ట్రాక్టర్ ఢీకొని 9 ఏళ్ల బాలుడు మృతి

  

ట్రాక్టర్ ఢీకొని 9 ఏళ్ల బాలుడు మృతి  

ఎస్.ఎస్. నగర్ మండలంలో విషాదం  

కుప్రియాల్‌లో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి  

పోలీసులు కేసు నమోదు, దర్యాప్తు  

కామారెడ్డి :  జిల్లాలో ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ఎస్.ఎస్. నగర్ మండల పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంగేమ్ అజిత్ కుమారుడు లక్ష్మణ్ (9) స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. కాగా, ఎస్.ఎస్. నగర్ మండలంలోని యాచారం గ్రామం వద్ద బాలుడిని ఒక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ఘటనపై ఎస్.ఎస్. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అధికారులు, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పసివాడి మృతితో కుటుంబ సభ్యులు, చంద్రాయన్ పల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

విద్యుత్ వైర్ తగిలి వ్యక్తి మృతి  

కామారెడ్డి జిల్లా కుప్రియాల్ గ్రామంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి పెనుగొండ ఎల్లయ్య (55) మృతి చెందాడు. పందుల నుంచి పంటను రక్షించేందుకు వ్యవసాయ పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్‌కు తాకి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم