Top News

Complex Meeting | బాన్సువాడ GHS పాఠశాలలో టీచర్ కాంప్లెక్స్ సమావేశం

బాన్సువాడ GHS పాఠశాలలో టీచర్ కాంప్లెక్స్ సమావేశం  

డీఆర్పీ అయ్యాల సంతోష్ పాల్గొని దిశానిర్దేశం  

ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు

బాన్సువాడ, ఆగస్టు 19: బాన్సువాడ జీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం టీచర్ కాంప్లెక్స్ సమావేశం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నరహరి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ అయ్యాల సంతోష్ మాట్లాడుతూ విద్యార్థులలో అన్ని సబ్జెక్టులలో తరగతి వారిగా, అంశాల వారిగా అభ్యసన సామర్థ్యాలను సాధించే విధంగా ప్రణాళికాబద్ధంగా బోధన అభ్యసన కృత్యాలను నిర్వహించాలని సూచించారు. 

ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ మానిటరింగ్ అధికారిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. జిల్లాను, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరహరి, కాంప్లెక్స్ సెక్రటరీ శ్రీనివాస్ రావు, ఆర్పీలు జరీనా, సంతోష్, నీరజ, ప్రవీణ కుమారి తో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم