రాఖీ పౌర్ణమి వేడుకల్లో పోచారం కుటుంబం - అన్నదమ్ములకు రాఖీ కట్టిన పోచారం అరుణ
హైదరాబాద్ & బాన్సువాడ: రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్) పర్వదినాన్ని పురస్కరించుకుని పోచారం కుటుంబంలో వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్‌లోని తన నివాసంలో డా. పోచారం రవీందర్ రెడ్డికి, అలాగే బాన్సువాడలోని నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డిలకు పోచారం అరుణ రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ "అన్నా-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకే రాఖీ పండుగ. ప్రతి సోదరి సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు" తెలిపారు.
కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.




إرسال تعليق