Top News

Helping Hands | నిమ్స్‌లో చికిత్స పొందుతున్న యువకుడికి ఆర్థిక సాయం

 


నిమ్స్‌లో చికిత్స పొందుతున్న యువకుడికి ఆర్థిక సాయం

- రూ.50,000 చెక్కు అందజేసిన మల్లంపేట్‌ మాజీ సర్పంచ్‌ అనంతస్వామి ముదిరాజ్‌, స్నేహ బృందం

బాన్సువాడ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, బ్రెయిన్‌ సంబంధిత సమస్యతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోర్లం గ్రామ యువకుడు మంద శ్రీకాంత్‌ కుటుంబానికి మల్లంపేట్‌ నాయకులు పెద్ద మనసుతో అండగా నిలిచారు.

బోర్లానికి చెందిన మంద శ్రీకాంత్‌ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైనంపై మల్లంపేట్‌ గ్రామ ప్రముఖులు, మాజీ సర్పంచ్‌, మాజీ కౌన్సిలర్‌ ఆర్కల అనంతస్వామి ముదిరాజ్‌, వారి స్నేహ బృందం స్పందించారు. శ్రీకాంత్‌ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని, తక్షణ సాయంగా అక్షరాల రూ. 50,000/- ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

ఈ మేరకు శ్రీకాంత్‌ తల్లి మంద విటమ్మను కలిసి ఆమెకు రూ. 50,000/- చెక్కును అందజేశారు.

తమ అభ్యర్థన మేరకు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి సాయం అందించిన అనంతస్వామి ముదిరాజ్‌ గారికి, వారి స్నేహ బృందానికి బోర్లం మాజీ వార్డ్‌ సభ్యుడు పూజం జీవన్‌తో పాటు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా నిలిచి సాయం చేసిన వారి ఉదారతను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు. ఈ సాయం అందించిన ప్రతి ఒక్కరికీ శ్రీకాంత్‌ కుటుంబ సభ్యులు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

أحدث أقدم