Top News

దళిత బహుజన ఉద్యమం ఒక నిబద్ధత గల గొంతును కోల్పోయింది - TSSWJA రాష్ట్ర అధ్యక్షుడు గంగన్న

ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న ఆకస్మిక మృతి  

దళిత బహుజన ఉద్యమం ఒక నిబద్ధత గల గొంతును కోల్పోయింది - TSSWJA రాష్ట్ర అధ్యక్షుడు గంగన్న 

బాన్సువాడ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం, నిజాంసాగర్ మండలం ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న గారు బుధవారం గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం జర్నలిస్టు రంగానికి, దళిత బహుజన ఉద్యమానికి తీరని లోటు. ఈ సందర్భంగా TSSWJA రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న మాట్లాడుతూ, "ఆశన్న  దళిత జాతి ముద్దుబిడ్డ. ఆయన రచనల ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారు. ఆయన మరణం పాత్రికేయ రంగానికి పూడ్చలేని నష్టం. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి" అని తెలిపారు.

గత 25 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో సీనియర్ రిపోర్టర్‌గా విధులు నిర్వహించిన ఆశన్న, నిజాంసాగర్, జుక్కల్ ప్రాంతాల ప్రజా సమస్యలపై అనేక కథనాలు రాశారని తెలిపారు. ముఖ్యంగా దళిత, బహుజన, రైతు వర్గాల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని, సహచరులతో ఆప్యాయంగా, అందరితో కలిసిపోయే తత్వం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఆశన్న గారి ఆకస్మిక మరణంపై తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TSSWJA) రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేసింది.






Post a Comment

أحدث أقدم