డివైడర్ గుంతల్లో ఇరుక్కున్న వాహనాలు..
స్థానికుల ఆగ్రహం.. మున్సిపాలిటీ నిర్లక్ష్యంపై విమర్శలు
- బాన్సువాడలో అస్తవ్యస్తంగా రోడ్డు పనులు
- తవ్వి వదిలేసిన గుంతల్లో పేరుకుపోయిన మడమట్టి
- ఒకే రోజు మూడు వాహనాలు ఇరుక్కుపోవడంతో తీవ్ర ఇబ్బందులు
బాన్సువాడ, ఆగస్టు 23:
బాన్సువాడ పట్టణంలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారుతోంది. పట్టణంలోని ఓల్డ్ బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారిపై డివైడర్ నిర్మాణ పనుల కోసం అధికారులు తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గుంతలు తవ్వి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో, వర్షాలకు ఆ గుంతల్లో మట్టి పేరుకుపోయి బురదమయంగా మారింది.
ఆదివారం ఉదయం ఇదే మార్గంలో వెళ్తున్న మూడు వాహనాలు (కార్లు, ఆటోలు) ఆ గుంతల్లో అకస్మాత్తుగా ఇరుక్కుపోయాయి. రోడ్డు మధ్యలో వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను బయటకు తీసేందుకు డ్రైవర్లు, స్థానికులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.
సంబంధిత మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి, అసంపూర్తిగా ఉన్న డివైడర్ పనులను త్వరగా పూర్తి చేయాలని... లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.( వీడియో 👇)

إرسال تعليق