గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు - సదాశివనగర్ సీఐ వీరయ్య
సదాశివనగర్, సెప్టెంబర్ 03:
గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని సదాశివనగర్ సీఐ వీరయ్య తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ సర్కిల్ పరిధిలోని సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి మండలాల డీజే నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు. పోలీసుల సూచనలను పాటించకుండా ఎవరైనా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ప్రతి డీజే నిర్వాహకుడికి వర్తిస్తాయని సీఐ స్పష్టం చేశారు.

إرسال تعليق