SGT యూనియన్ పెద్దకొడప్‌గల్ మండల అధ్యక్షుడిగా తిప్పని మారుతి ఎన్నిక
అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నిక
పెద్దకొడప్‌గల్, సెప్టెంబర్ 03:
పెద్దకొడప్‌గల్ మండలంలోని ZPHS పాఠశాలలో గురువారం SGT యూనియన్ మండల కమిటీని కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా తిప్పని మారుతి, గౌరవ అధ్యక్షుడిగా ఎల్పుగొండ బాల్ రాజ్, ప్రధాన కార్యదర్శిగా సీనుగారి నరేష్, ఉపాధ్యక్షుడిగా వాగ్మారె బాలాజీ, కోశాధికారిగా కొరంపల్లి నవీన్, మహిళా అధ్యక్షురాలిగా స్వర్ణబాయి, మహిళా కార్యదర్శిగా సరిత, సాంకేతిక కార్యదర్శిగా కొయ్యడ శ్రీకాంత్, మండల కార్యదర్శిగా ఎర్రోళ్ల బాల్ రాజ్, జాయింట్ సెక్రటరీలుగా హనుమాండ్లు, బిక్షపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మహమ్మద్ చీమన్, సలహాదారుగా కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అయ్యాల సంతోష్ మాట్లాడుతూ.. SGT యూనియన్ SGT ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, SGTలకు టీచర్స్ MLC ఓటు హక్కు, GO 25 మరియు GO 317 రద్దు కోసం నిరంతరం పని చేస్తుందన్నారు. SGT ఉపాధ్యాయులు ఐక్యంగా ఉన్నప్పుడే అనుకూల GOలు వస్తాయని, అందరూ సమస్యలను గుర్తించి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


إرسال تعليق