అయ్యప్ప ఆలయంలో అన్నదానం 

 కవితక్క సంకల్పం నెరవేరాలని టీ ఆర్ ఎస్ పూజలు 

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  టీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు మామిండ్ల రాజు ఆధ్వర్యంలో ఈ అన్నదానం జరిగింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిరుపేదలకు, అన్నార్తులకు, భక్తులకు అన్నదానం చేశారు.  ఈ సందర్భంగా మామిండ్ల రాజు మాట్లాడుతూ, "టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో మంచి సంకల్పంతో పార్టీ ఆవిర్భవించింది. ఆమె సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించాం" అని తెలిపారు.  

"మంచి మనసుతో ఆమె చేసిన పార్టీ ఆవిర్భావం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంతో భక్తి శ్రద్ధ ఉన్న కవితక్క బడుగు బలహీన వర్గాల కోసం, నిరుపేద కుటుంబాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు" అని ఆయన కొనియాడారు.  

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.





1 Comments

Post a Comment

Previous Post Next Post