WEATHER|వడగాలుల హెచ్చరిక - ఏప్రిల్ 12-22


(తెలంగాణ డైలీ న్యూస్ డెస్క్)

తెలంగాణలో ఏప్రిల్ 12 నుంచి భారీ వడగాలులు రాబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రమంతా 40°C పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.

ఉత్తర, తూర్పు తెలంగాణలోని రెడ్ మార్క్ జిల్లాల్లో తీవ్రమైన వేడిని ఎదుర్కొంటాయని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో కూడా ఏప్రిల్ 12-22 మధ్య వరుసగా 10 రోజులు 40-41°C ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు.

అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని, నీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, మధ్యాహ్నం సమయంలో అనవసర ప్రయాణాలు వద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post