కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా
రాష్ట్ర ప్రభుత్వ అడుగులు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణాన్ని క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను మరియు ప్రతిపాదిత ఇండోర్ స్టేడియం స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించి పనులను ప్రారంభించారు
ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ పనులను అధికారులు సమక్షంలో పరిశీలించిన షబ్బీర్ అలీ, పనులు నాణ్యతతో వేగవంతంగా చేపట్టాలని సూచించారు
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. 8 కోట్ల 90 లక్షలను కేటాయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డి క్రీడా రంగంలో విశిష్ట స్థానం సంపాదించనుందని పేర్కొన్నారు.స్టేడియంలో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి తెలిపారు
అంతర్జాతీయ ప్రమాణాల రన్నింగ్ ట్రాక్
ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ
విశాలమైన గ్యాలరీలు
అత్యాధునిక ఇండోర్ స్టేడియం
ఆధునిక జిమ్
రైఫిల్ షూటింగ్ రేంజ్
వాలీబాల్ కోర్టు
టెన్నిస్ కోర్టు
టేబుల్ టెన్నిస్ సదుపాయాలు మరియు ముఖ్యమంత్రితో చర్చించి భవిష్యత్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని కూడా చేపడతామని షబ్బీర్ అలీ తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాలు క్రీడలను విస్మరించాయి. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం యువత ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గ్రామీణ క్రీడాకారులు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై మెరవడం మా లక్ష్యం.అదేవిధంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయింది.పనులు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి.ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.స్టేడియం పూర్తయిన తరువాత ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు శిక్షణ పొందేందుకు రావడమే కాకుండా, జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించే అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగాతెలియజేస్తున్నామన్నారు.
కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు మారనున్నాయనే వార్తతో స్థానిక క్రీడాకారులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ జిల్లాలో క్రీడా వికాసానికి నూతన దిశను నిర్దేశించనుంది.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమాశ్రీనివాస్, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, అనంతరెడ్డి, భీమ్ రెడ్డి, నౌసిలాల్, పాత రాజు, లక్ష్మీ రాజా గౌడ్, ఐరేనీ సందీప్, కారంగుల అశోక్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



Post a Comment