వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఐదేళ్ల బాలుడి హత్య
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో శుక్రవారం రాత్రి హత్య జరిగింది. ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి, ఆ మహిళ కొడుకు అడ్డు వస్తున్నాడని అతన్ని హత్య చేశాడు. కామారెడ్డి పోలీసు సబ్‌డివిజన్ ఏఎస్పీ చైతన్యరెడ్డి ఈ వివరాలు తెలిపారు. బీబీపేట మండలం మహ్మదాపూర్‌కు చెందిన నర్సింలు, రాజాంపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళతో ఆరు నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. ఆ మహిళ తన భర్తకు దూరంగా ఎనిమిదేళ్ల కూతురు, అయిదేళ్ల కొడుకు శ్రావణ్‌తో కలిసి కామారెడ్డిలో ఉంటోంది. కూతురిని పుట్టింటి వద్ద వదిలేయవచ్చని, కానీ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కొడుకు శ్రావణ్ మాత్రం తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భావించారు. ఎలాగైనా హత్య చేయాలని తల్లి, నర్సింలు నిర్ణయించుకున్నారు.
శుక్రవారం రాత్రి ఇంట్లో ఆ మహిళ లేని సమయంలో మద్యం తాగి వచ్చిన నర్సింలు మత్తులో శ్రావణ్ కళ్లలో కారం చల్లాడు. అనంతరం కత్తితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు.
తర్వాత ఏమైంది?
👉 సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ నరహరి, పోలీసులు వివరాలు సేకరించారు.
👉 నర్సింలును, బాలుడి తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
👉బుద్ధిమాంద్యంతో ఉన్న 5 ఏళ్ల చిన్నారిని సొంత తల్లే ప్రియుడితో కలిసి హత్య చేయించడం అత్యంత అమానుషం.

Post a Comment