Mahatma Jyotiba Poole Jayanti | డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళు : పోచారం

బాన్సువాడకు అవార్డు రావడం ప్రశంసనీయం 

ఆసుపత్రిలో మూడు రాష్ట్రాల రోగులకు సేవలు 

ఎమ్మెల్యే పోచారం సమక్షంలో ఘనంగా పూలే జయంతి

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:

డాక్టర్లు ప్రత్యక్ష దేవుళ్ళని, బాన్స్ వాడ ఆసుపత్రిలో అధిక డెలివరీలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి, అవార్డు రావడం చాలా సంతోషమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అవార్డు రావడానికి కారణమైన డాక్టర్లు,సిబ్బందిని అభినందించారు.  ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల ముగింపు సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు.

ఈ ఆస్పత్రికి మహారాష్ట్ర,కర్ణాటక ప్రజలు కూడా వస్తారని,  3 రాష్ట్రాల ప్రజలకు సేవలందిస్తున్న ఆస్పత్రి బాన్సువాడ ఆస్పత్రి అన్నారు.  ఇక్కడ ఉన్న డాక్టర్లు,సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఇతర రాష్ట్రాల ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని అన్నారు.

మొదటగా ఆసుపత్రిలో మహాత్మ జ్యోతి రావు పూలే  జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలతో నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈనెల 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ఏరియాలో అత్యధికంగా సాధారణ డెలివరీలు జరిగిన ఆసుపత్రిగా అవార్డు పొందిన ఆసుపత్రి వైద్యులను, వైద్య సిబ్బందిని అభినందించారు.

 కామారెడ్డి జిల్లా DCHS, ఆసుపత్రి సూపరిండెంట్ డా. విజయ భాస్కర్, డిప్యూటీ DMHO డా.  విద్యా, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post