Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44పై శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. అంబులెన్స్‌ను వేగంగా వచ్చిన ప్రైవేట్ టూరిస్ట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ (35), పేషెంట్ సలేహ భాను (70) ప్రాణాలు కోల్పోయారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం ఆదిలాబాద్‌కు చెందిన సలేహ భాను ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. కోలుకున్న అనంతరం ఆమెను అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. TG08Y3258 నంబర్ గల ప్రైవేట్ టూరిస్ట్ బస్సు వేగంగా వచ్చి అంబులెన్స్‌ను ఢీకొట్టడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న భిక్కనూర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post