•సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో రాష్ట్రంలోనే రెండో స్థానం – సోమ్ల నాయక్ తండా రికార్డు
•బాన్సువాడ డివిజన్‌లో 100% పూర్తి చేసిన మొదటి గ్రామం
•అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఘనత
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమ్లా నాయక్ తండా గ్రామం తెలంగాణ రాష్ట్రంలోనే 100% స్వీయ గణన (Self Enumeration) పూర్తి చేసిన రెండవ గ్రామంగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా బాన్సువాడ డివిజన్‌లో 100% పూర్తి చేసిన మొదటి గ్రామంగా నిలిచింది.
అవగాహనతో సాధ్యం:
జిల్లా కలెక్టర్ సూచనల మేరకు మండల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో స్వీయ గణనపై గ్రామ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. దీంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గణనలో పాల్గొన్నారు.
100% పూర్తి:
మంగళవారం మండల, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయులు గ్రామ ప్రజలతో కలిసి స్వీయ గణనను 100% పూర్తి చేసినట్లు బాన్సువాడ తహసీల్దార్ రాజ్ నరేందర్ గౌడ్ తెలిపారు.
అధికారుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో సోమ్లా నాయక్ తండా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామస్తులను, సిబ్బందిని మండల అధికారులు అభినందించారు.

Post a Comment