Bidi Contractors | బీడీ కమీషన్ ఏజెంట్లకు కాంట్రాక్ట్ వర్కర్ హోదా ఇవ్వాలి


•బీడీ కమీషన్ ఏజెంట్లకు కాంట్రాక్ట్ వర్కర్ హోదా ఇవ్వాలి 

– ఐక్య వేదిక డిమాండ్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

బీడీ కమీషన్ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని, 10 ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ బీడీ కమీషన్ ఏజెంట్స్ ఐక్య వేదిక వినతి పత్రం సమర్పించింది.

ప్రధాన డిమాండ్లు:  

తెలంగాణ బీడీ కమీషన్ ఏజెంట్స్ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ రచ్చ ఆంజనేయులు గురువారం తెలంగాణ బీడీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్‌కు వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రంలోని ముఖ్యాంశాలు:  

1. బీడీ కమీషన్ ఏజెంట్లందరినీ కాంట్రాక్ట్ బీడీ వర్కర్లుగా గుర్తించి ఐడీ కార్డ్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు యాజమాన్యాల ద్వారా ఇప్పించాలి.

2. వెయ్యి బీడీల కూలి రేటుపైన 2% బోనస్‌ను కమీషన్ ఏజెంట్లకు ఆర్థిక సంక్షేమానికి యాజమాన్యాలు కేటాయించాలి. అయిదులక్షల మెడి క్లెయిమ్ వైద్య సౌకర్యంతో పాటు భీమా సౌకర్యం కల్పించాలి.

3. కమీషన్ ఏజెంట్లు తయారు చేయించిన వెయ్యి బీడీల కూలీరేటుతో 25% కమీషన్ పెంచి అమలుకు చర్యలు తీసుకోవాలి.

4. ప్రతీ బీడీ కంపెనీలో వెయ్యి బీడీలకు వందయాభై, గ్రాముల తునికాకు మార్జిన్ ఇవ్వాలి. ప్రతి ఆకుడాగును సెంటర్ గోదాంలో తూకం వేసి ఇవ్వాలి.

5. కమీషన్ ఏజెంట్ల డిపాజిట్ రూపాయలను ఫ్లాట్స్ మరియు పొలం భూమిపైన పెట్టుబడి పెట్టాలి.

6. ప్రతి మూడునెలలకు ఒకసారి టీడీఎస్ ద్వారా కమీషన్ ఏజెంట్లపై పడుతున్న ఆర్థిక భారాన్ని యాజమాన్యమే భరించాలి.

7. ప్రతి కమీషన్ ఏజెంట్లకు ప్రతినెల రూ. 5000/- టి.ఎ. డి.ఎ. కింద యాజమాన్యం ఇవ్వాలి.

8. వెయ్యిబీడీల కూలీలో నుంచి రూ. 6 నుండి 12 రూపాయల వరకు బీడీ కమిషన్ ఏజెంట్ల కమిషన్ నుండి యాజమాన్యం తగ్గించి ఇవ్వడాన్ని వెంటనే ఆపాలి. బీడీ కంపెనీలు శాంపుల్ బీడీ తీసుకోవడం ఆపాలి.

9. కమీషన్ ఏజెంట్లు యాజమాన్యాల మధ్య జరిగే చర్చల్లో కమీషన్ ఏజెంట్లతోనే చర్చలు జరపాలి. ఏడాది కోసారి అగ్రిమెంట్ తప్పక జరపాలి.

10. ప్రతి బ్రాంచ్‌లో పనిచేస్తున్న బీడీ కార్మికుల కూలీల డబ్బులను ఠికేదార్ ఖాతాలోనే జమచేయాలి.

గత ఐదు దశాబ్దాలుగా శ్రమకు తగిన ఫలితం లేక ఆర్థికంగా నష్టపోతున్నామని, ప్రస్తుతం పెరుగుతున్న ధరలు, బ్రాంచ్ కిరాయి, పెట్రోలు ఖర్చులతో కమీషన్ సరిపోవడం లేదని వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. బీడీ కమీషన్ ఏజెంట్ల సంక్షేమం కోసం డిమాండ్లను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.

Post a Comment

Previous Post Next Post