JKL MLA Thota | ఆయిల్ పామ్‌తో రైతులకు ఆర్థిక లాభాలు: ఎమ్మెల్యే

జుక్కల్‌లో ఆయిల్ పామ్ తోట పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

•ఆయిల్ పామ్‌తో రైతులకు ఆర్థిక లాభాలు: ఎమ్మెల్యే  

•ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, ఆయిల్ పామ్ రైతులకు సన్మానం

తెలంగాణ డైలీ న్యూస్,జుక్కల్: మండల కేంద్రంలోని ఆయిల్ పామ్ తోటలో మంగళవారం  నిర్వహించిన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. తోటలో పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

*రైతులతో ముఖాముఖి*:  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో ముఖాముఖి మాట్లాడి ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపు, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు.

ఆయిల్ పామ్ నాటిన తర్వాత సుమారు నాలుగు సంవత్సరాల నుంచి దిగుబడి ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఆర్థిక లాభాలు క్రమంగా పెరుగుతాయని రైతులకు వివరించారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణతో వచ్చే లాభాలను తెలియజేస్తూ, ఆధునిక పద్ధతులు అవలంబించి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు.

*రైతులకు సన్మానం*:  

కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

“రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నది ఈ ప్రభుత్వం. ఇదే ప్రజా ప్రభుత్వం” అని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెలిపారు.

కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post