Collector | దళితుల ఆశాజ్యోతి భాగ్యరెడ్డి వర్మ : కలెక్టర్ భవేష్ మిశ్రా

 


దళితుల ఆశాజ్యోతి భాగ్యరెడ్డి వర్మ : కలెక్టర్ భవేష్ మిశ్రా

కలెక్టరేట్ లో ఘనంగా 138వ జయంతి

తెలంగాణ డైలీ న్యూస్, నిర్మల్:

దళిత వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహా మనీషి మాదరి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భాగ్యరెడ్డి వర్మ 138 వ జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. పలువురు అధికారులతో కలిసి భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు జీవితాంతం పాటుపడిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అన్నారు. దళిత బాలికల కోసం నిజాం కాలంలోనే దళిత బాలికల కోసం 26 పాఠశాలలను స్థాపించారన్నారు. కుల వివక్షత నిర్మూలన, మూఢనమ్మకాలపై చైతన్యం, దేవదాసీ వ్యవస్థ నిర్మూలన, మద్యపాన నిషేధం, బాలిక విద్య వంటి అనేక విషయాల్లో ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. ఆది హిందూ సోషల్ లీగ్ సంస్థను ఏర్పరిచి జాతుల మధ్య అంతరాలు తొలగించారని తెలిపారు. భాగ్యరెడ్డి వర్మ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.  సమాజంలో విశిష్ట మార్పులకు కృషిచేసిన మహనీయుల జయంతి, వర్ధంతి వేడుకలు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, బిసి, ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాస్, అంబాజీ,  మోహన్ సింగ్, సిపిఓ జీవరత్నం, ఉపాధి కల్పన అధికారి విజయలక్ష్మి, జిల్లా పౌర సంబంధాల అధికారి విష్ణువర్ధన్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post