Top News

Donation | దాస్ హనుమాన్ మందిర నిర్మాణానికి రూ.5116 విరాళం


దాస్ హనుమాన్ మందిర నిర్మాణానికి రూ.5116 విరాళం  

ఎక్స్ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్ రెడ్డికి శాలువాతో సన్మానం  

జక్కల్ దాని తండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమం  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సు వాడ రూరల్:

ఉమ్మడి బోర్లం గ్రామ పంచాయతీ పరిధిలోని జక్కల్ దాని తండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దాస్ హనుమాన్ మందిర నిర్మాణం చేపట్టారు. మందిర నిర్మాణం కోసం ఎక్స్ ఎంపీటీసీ బోర్లం శ్రీ పెద్ద పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి 5116 రూపాయలు విరాళంగా అందజేశారు. 

శ్రీ దాస్ ఆంజనేయ స్వామి కరుణకటాక్షాలు వారి కుటుంబంపై ఉండాలని కోరుతూ ఉమ్మడి బోర్లం సర్పంచ్ శాంత రూసింగ్, మాజీ సర్పంచ్ సంగయ నాయక్, ఉప సర్పంచ్ బన్సీ నాయక్, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ఆంగోత్ గంగారం, కాంటెస్ట్ సర్పంచ్ ఎర్రోళ్ల సాయిలు తదితరులు శ్రావణి దేవేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. 

కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post