పారదర్శక పాలనే లక్ష్యం: షబ్బీర్ అలీ
క్షేత్రస్థాయిలో అమలు ముఖ్యం: పోచారం
అందరికీ పథకాలు చేరాలి: ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
లక్ష్యాలను పూర్తి చేస్తాం: కలెక్టర్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక: కామారెడ్డిలో జిల్లా స్థాయి సమీక్ష
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమీక్ష సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత్ రావు, కలెక్టర్ ఆశిష్ సంగవాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రజాప్రతినిధుల హాజరు
సమావేశంలో వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
99 రోజుల ప్రణాళికపై సమీక్ష
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
పారదర్శక పాలనే లక్ష్యం: షబ్బీర్ అలీ
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను కేంద్రబిందువుగా తీసుకొని పారదర్శక పరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా చేరే విధంగా అధికారులు పని చేయాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కేవలం సమీక్ష సమావేశాలకు పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణాల్లో కనిపించే మార్పుగా మారాలని అన్నారు. ప్రతి శాఖకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందని, వాటి అమలులో వేగం పెంచాలని సూచించారు.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా స్థాయిలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రతి అధికారిపై ఉందని తెలిపారు. జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
క్షేత్రస్థాయిలో అమలు ముఖ్యం: పోచారం
పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తే ప్రజలకు మెరుగైన ఫలితాలు అందుతాయని తెలిపారు.
అందరికీ పథకాలు చేరాలి: ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ తీసుకొని ప్రభుత్వ పథకాలను అందరికీ చేరవేయాలని కోరారు.
లక్ష్యాలను పూర్తి చేస్తాం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.






Post a Comment