రుద్రూర్ మహిళపై కందకుర్తిలో దాడి
అక్రమ సంబంధం ఆరోపణలతో దేహశుద్ధి
పోలీస్ స్టేషన్‌కు తరలింపు
తెలంగాణ డైలీ న్యూస్, బోధన్:
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళపై రెంజల్ మండలం కందకుర్తి పుణ్యక్షేత్రంలో దాడి జరిగింది. బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన స్వామి యజ్ఞం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
అక్రమ సంబంధం ఆరోపణ
హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి భార్య, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కందకుర్తికి వచ్చి ఆ మహిళ పై దాడి చేశారు. గత ఏడాదిగా తన భర్తతో ఆ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. అయితే మహిళ మాత్రం తను తీసుకురాలేదని పదే పదే ప్రాదేయపడింది.
డబ్బులు వసూలు చేశారని ఆరోపణ
గత ఆరు నెలలుగా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులు వసూలు చేసి, భర్త జీవితంతో ఆడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. లాడ్జిల్లో, సొంత ఇంట్లోనే అసాంఘిక కార్యక్రమాలు నడిపిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారిని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో న్యాయం కోరతామని భవాని కుటుంబ సభ్యులు తెలిపారు.


Post a Comment