Top News

Prime Minister Modi Visit | ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన పూర్తిగా రాజకీయమే: ఎంపీ ధర్మపురి అరవింద్

 


•ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన పూర్తిగా రాజకీయమే: ఎంపీ ధర్మపురి అరవింద్  

•రూ.7823 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో పర్యటించడం పక్కా రాజకీయ పర్యటనేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతిపక్షాల్లో వణుకు:  

"ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ప్రతిపక్ష పార్టీలలో హాట్ చర్చకు దారి తీసింది. దీంతో కేసీఆర్, రేవంత్ రెడ్డిలతో పాటు ప్రాంతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. కాంగ్రెస్‌ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఇక రీజనల్ పార్టీలన్నింటిలో అభద్రతాభావం మొదలైంది" అని అరవింద్ వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలవబోతోందని, అక్కడ మమతా బెనర్జీని ఓడించడం 'డిఫరెంట్ లెవల్' అని, అక్కడ గెలిచిన పార్టీ ఎక్కడైనా గెలుస్తుందని అన్నారు.

రూ.7823 కోట్ల అభివృద్ధి పనులు:  

తెలంగాణలో రూ.7823 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఎంపీ తెలిపారు.

1. జహీరాబాద్: రూ.2360 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులకు శంకుస్థాపన  

2. జాతీయ రహదారి: మహబూబ్‌నగర్ 161 నేషనల్ హైవేపై 4 లైన్ల రహదారి పనులకు రూ.3175 కోట్లు  

3. రైల్వే స్టేషన్లు: అమృత్ భారత్ పథకం కింద రూ.40 కోట్లతో ఆధునికరించిన రెండు రైల్వే స్టేషన్లు  

4. వరంగల్: రూ.200 కోట్లతో పిఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కు  

5. రైల్వే టెర్మినల్స్: రూ.611 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్స్  

6. కాజీపేట-విజయవాడ: రూ.1243 కోట్లతో 3 లైన్ల రైల్వే పనులు  

అనంతరం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సుమారు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని చెప్పారు.



మహిళా రిజర్వేషన్ బిల్లుపై:  

"మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన పార్టీలన్నీ భవిష్యత్తులో వారి సమాధిని వారే తవ్వుకున్నాయి. వచ్చే 17వ లోక్‌సభలో ఈ బిల్లును పాస్ చేస్తాం. ఎవరు వ్యతిరేక ఓటు వేసినా ఆగదు. మెజారిటీ 543 ఉంటుందా, 700 ఉంటుందా, 800 ఉంటుందా చెప్పలేం" అని అన్నారు.

టీఆర్ఎస్‌పై విమర్శలు:  

"తెలంగాణలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ ఎవరిపైనా ప్రభావం చూపదు. కల్వకుంట్ల కవిత ఆమె తండ్రి, అన్న చేసినవన్నీ బయటపెడుతుంది. లిక్కర్ స్కాములో ఎవిడెన్స్ లేవని మాత్రమే కోర్టు చెప్పింది. ఆ కేసులో సీబీఐ ఎంటరైంది. ఎవిడెన్స్ లేవని చెప్పినంత మాత్రాన స్కామ్ జరగలేదని కాదు. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరూ సుద్దపూసలు లేరు" అని ఎద్దేవా చేశారు.

కవిత టీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సపోర్టు ఉందని, అది అంతిమంగా బీజేపీకి ప్లస్ అవుతుందని అరవింద్ అభిప్రాయపడ్డారు.



Post a Comment

Previous Post Next Post