BRS Dharna | బాన్సువాడలో బీఆర్ఎస్ రాస్తారోకో

బాన్సువాడలో బీఆర్ఎస్ రాస్తారోకో, బండి సంజయ్ ఫ్లెక్సీల దహనం  

పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట  

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:  

కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా


లో సోమవారం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు సాయి భగిరథ్ ఫొటోలు ఉన్న ప్లకార్డులను దగ్ధం చేశారు.

ఫ్లెక్సీలను దగ్ధం చేసే సమయంలో పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సరైన చర్యలు తీసుకోవడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.



సాయి భగిరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అంజిరెడ్డి, చందర్, జుబేర్, అక్బర్, ఫెరోజ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

Previous Post Next Post