Top News

Pitlam Govt Hospital | 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే పూజ

పిట్లంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక పూజ   

16న మంత్రి దామోదర చేతుల మీదుగా ప్రారంభం: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు  

తెలంగాణ డైలీ న్యూస్, పిట్లం:

పిట్లం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పిట్లం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఆసుపత్రి నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DCHS), ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post