Top News

Collector | యాసంగి మక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశం

యాసంగి మక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆదేశం  

కలెక్టర్ సమీక్ష సమావేశం  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

యాసంగి 2025-26 సీజన్‌లో జిల్లాలో కొనసాగుతున్న మక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ శనివారం తన ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, జిల్లా సహకార అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారి, డి.ఎం. MARKFED, వేర్‌హౌస్ మేనేజర్లు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రీజినల్ మేనేజర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు  

రైతులు తీసుకువస్తున్న మక్కజొన్నను వేగవంతంగా కొనుగోలు చేసి, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా మక్కజొన్న నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డీసీఓకు సూచించారు.

హమాలీల సంఖ్య పెంపు, గోడౌన్ల వినియోగం  

సొసైటీ స్థాయిలో హమాలీల సంఖ్యను పెంచి, కొనుగోలు చేసిన మక్కజొన్నను ప్రతిరోజూ గిడ్డంగులకు తరలించాలని ఆదేశించారు. గుర్తించిన గోడౌన్లను వెంటనే స్వాధీనం చేసుకుని వినియోగంలోకి తీసుకురావాలని TGSWC రీజినల్ మేనేజర్‌కు సూచించారు. అన్‌లోడింగ్ పాయింట్ల వద్ద హమాలీలను పెంచి, వాహనాలను పూర్తిస్థాయిలో అన్‌లోడ్ చేయాలని చెప్పారు.

రవాణాలో జాప్యం వద్దు  

లారీ రవాణా కాంట్రాక్టర్ అవసరమైన లారీల సంఖ్యను పెంచి మక్కజొన్న రవాణా ఆలస్యం లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో అదనపు నిల్వ సామర్థ్యం గల గోడౌన్లను గుర్తించి స్టోరేజ్ స్పేస్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులకు సూచించారు.

నిరంతర పర్యవేక్షణకు ఆదేశం  

డి.ఎం. MARKFED, అదనపు కలెక్టర్ జిల్లాలో మక్కజొన్న కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


అదనపు డీఆర్డీఏ ఈజీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కుటుంబరావు శనివారం జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి  పూల మొక్కను  అందజేశారు.

Post a Comment

Previous Post Next Post