రేపు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపు
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:
మైనర్ బాలికపై వచ్చిన అత్యాచార ఆరోపణల వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్‌పై నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత బాలికకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై బీజేపీ మౌనం దేనికి సంకేతమని నాయకులు ప్రశ్నించారు.
ఈ ఘటనకు నిరసనగా మంగళవారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల్లో భారీ ఎత్తున రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా డీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పిలుపునిచ్చారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోరారు.

Post a Comment