నిజాంసాగర్ లో కాంగ్రెస్ రాస్తారోకో
బొగ్గుగుడిసె చౌరస్తాలో భారీ నిరసన
బండి భగీరత్‌పై చర్యలు డిమాండ్
తెలంగాణ డైలీ న్యూస్, నిజాంసాగర్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆందోళన ఉధృతమైంది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ఆదేశాల మేరకు నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు.
మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ప్రజా పండరి నాయకత్వం వహించారు. "బీజేపీ మౌనం ఎందుకు?", "బాధితురాలికి న్యాయం చేయాలి", "దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి" అంటూ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజాంసాగర్ మండలాల గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మైనర్ బాలికపై వచ్చిన ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమని, ఎంతటి పెద్దవారైనా దోషులు అయితే కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.


Post a Comment