విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
తెలంగాణ డైలీ న్యూస్, నిర్మల్:
ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా వారోత్సవాలు, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, జనగణన సెల్ఫ్ ఎన్యుమరేషన్, ఫార్మర్ రిజిస్ట్రీ, తదితర అంశాలపై, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి సి ఎస్ రామకృష్ణా రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
![]() |
| వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సి ఎస్ |
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యా వారోత్సవాలు ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు ప్రణాళికకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో పనుల శంకుస్థాపనలు, ఎస్ ఎస్ సి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత కోసం ప్రత్యేక విద్య శిబిరాల నిర్వహణ, వర్క్ షాప్ ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, విద్యా వేడుకల కార్యక్రమాలు నిర్ణిత ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. జనగణన ప్రక్రియకు సంబంధించి, సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ వీసి లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఈఓ భోజన్న, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, పౌర సరఫరాల అధికారి, మేనేజర్ లు రాజేందర్, సుధాకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Post a Comment