CS's Video Conference | నాలుగు కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్



నాలుగు కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ 

సీఎస్ రామకృష్ణారావుతో వీడియో కాన్ఫరెన్స్

జిల్లా పురోగతి వివరించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి :   

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రామకృష్ణారావు శనివారం జిల్లా కలెక్టర్లతో దృశ్య శ్రవణ సమావేశం నిర్వహించారు. అగ్రి స్టాక్‌లో రైతుల రిజిస్ట్రేషన్, జనాభా గణన, ధాన్యం కొనుగోలు, విద్యా వారోత్సవాల నిర్వహణపై సీఎస్ పలు ఆదేశాలు జారీ చేశారు.

వీసీ అనంతరం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలో ఈ నాలుగు అంశాల పురోగతిని వివరించారు. సెన్సెస్ 2027లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 9,631 మంది స్వీయ గణన పూర్తి చేశారని తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు 30 రోజుల పాటు గృహ గణన జరుగుతుందని, 1,954 మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పని చేస్తారని చెప్పారు.


👉మే 11 నుంచి ప్రారంభమయ్యే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. సోమవారం ఎల్.బీ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి జిల్లా నుంచి 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఏఎంసీ సభ్యులను బస్సుల్లో హైదరాబాద్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

👉అగ్రి స్టాక్‌లో ప్రతి రైతు తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నమోదైన రైతులకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు నేరుగా అందుతాయని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 2,11,434 మంది రైతులు నమోదు చేసుకోగా, ఇంకా 1,01,505 మంది నమోదు కావాల్సి ఉందన్నారు.


👉రబీ 2025-26 వరి కొనుగోళ్లపై మాట్లాడుతూ, ఇప్పటివరకు 2,06,977 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. అందులో 1,64,747 మె.ట.లకు TAB ఎంట్రీలు 80%, 1,51,330 మె.ట.లకు ట్రక్ చిట్లు 92%, 1,44,893 మె.ట.లకు మిల్లర్ అంగీకారాలు 96% పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు MSP కింద 1,44,039 మె.ట.లకు రూ.344.11 కోట్లు చెల్లించామన్నారు.

👉పెండింగ్‌లో ఉన్న TAB ఎంట్రీలు, ట్రక్ చిట్లు, మిల్లర్ అంగీకారాలను ప్రాధాన్యతగా పూర్తి చేసి రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరపాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్ని PPC కేంద్రాల్లో తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, తూకం వేసిన సంచులు, ధాన్య నిల్వలను వర్షం నుంచి రక్షించాలని సూచించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలను తార్పాలిన్లతో కప్పుకోవాలని, ఉరుములు-మెరుపుల సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి. విక్టర్, డీఆర్డీఓ, డీసీఓ, వ్యవసాయ, విద్యా, సివిల్ సప్లైస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post