తడిహిప్పర్గలో విద్యుత్ షాక్‌తో తాత్కాలిక లైన్‌మెన్ మృతి
ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కోసం స్తంభం ఎక్కి ప్రమాదం
11 కేవీ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి
కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు
తెలంగాణ డైలీ న్యూస్, మద్నూర్:
మద్నూర్ మండలం తడిహిప్పర్గ గ్రామంలో గురువారం విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ మరమ్మతుల కోసం స్తంభం ఎక్కిన తాత్కాలిక లైన్‌మెన్ నాగు వయసు 50 సంవత్సరాలు, 11 కేవీ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నాగు ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల నిమిత్తం స్తంభం ఎక్కగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ వైరు తగిలింది. దీంతో తీవ్ర షాక్‌కు గురై స్తంభంపైనే వేలాడుతూ ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కిందికి దించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.

Post a Comment