Former Registration | ఫార్మర్ రిజిస్ట్రీ 67.65 శాతం పూర్తి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్



ఫార్మర్ రిజిస్ట్రీ 67.65 శాతం పూర్తి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  

జూన్ 2 నాటికి ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలి: అధికారులకు ఆదేశం  

 తెలంగాణ డైలీ న్యూస్,  కామారెడ్డి:

కామారెడ్డి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం 67.65 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతుల నమోదు పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

జిల్లాలో మొత్తం 3,12,939 పీపీబీలు ఉండగా, ఇప్పటివరకు 2,11,691 మంది రైతుల నమోదు పూర్తయిందని కలెక్టర్ వెల్లడించారు. మిగిలిన రైతుల నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి అర్హత గల రైతు వివరాలు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నమోదు ప్రక్రియ నిర్వహించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.

అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి జూన్ 2వ తేదీ నాటికి పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని తహసీల్దార్లు, సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా పనులు నిరంతరం కొనసాగేలా పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు నిర్మాణ సామగ్రి, సాంకేతిక సహాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటి పనుల పురోగతిని క్రమం తప్పకుండా పరిశీలించి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.



Post a Comment

Previous Post Next Post