•కామారెడ్డి జిల్లా ప్రో కబడ్డీ లీగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
•గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ:
"గ్రామాలలో దాగి ఉన్న ప్రతిభావంతులైన కబడ్డీ క్రీడాకారులను వెలికితీసి ప్రోత్సహిస్తున్న కామారెడ్డి జిల్లా ప్రో కబడ్డీ లీగ్ నిర్వహణ అభినందనీయం" అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సీనియర్స్ మహిళల, కామారెడ్డి జిల్లా పురుషుల కామారెడ్డి జిల్లా ప్రో కబడ్డీ లీగ్‌ను
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా లీగ్ ఆర్గనైజర్ సీహెచ్. రాజును ఎమ్మెల్యే పోచారం ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు కేపీఎల్ మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, సి ఐ శ్రీధర్, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







Post a Comment