Top News

SSC Toppers | 10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఐవిఎఫ్ సన్మానం

 


10వ తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు ఐవిఎఫ్ సన్మానం

550 ఆ పై మార్కులు సాధించిన విద్యార్థులు 18లోపు వాట్సప్ చేయాలి

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 2026లో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550, ఆ పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 25 సోమవారం సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఐవిఎఫ్ జిల్లా కమిటీ తెలిపింది. 

అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఈ సన్మాన కార్యక్రమం చేపట్టినట్లు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గుప్త వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ హాజరై విద్యార్థులను అభినందించనున్నారు.

550కి పైగా మార్కులు సాధించిన కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య విద్యార్థులు తమ వివరాలను ఈ నెల 18వ తేదీ లోపు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ బాలు - 9492874006 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపించాలని నిర్వాహకులు కోరారు. 18లోపు వచ్చిన విద్యార్థుల వివరాలను మాత్రమే సన్మానానికి పరిగణిస్తామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్, పట్టణ వైశ్య సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ 9849601438, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ 9440054065, కోశాధికారి కస్వ వెంకటేష్ 9848280665, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి 9885707042, ఎర్రం విజయ్ కుమార్ 9491461854 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, సలహాదారులు మందుల రామచంద్రం పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post