Theft Cases in Birkur | బీర్కూర్‌లో దొంగల బీభత్సం

బీర్కూర్‌లో దొంగల బీభత్సం

తాళాలు వేసిన 4 ఇళ్లలో భారీ చోరి

20 తులాల బంగారు ఆభరణాలు, 120 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు చోరి

తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్:

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి నాలుగు ఇళ్లలో భారీ చోరీకి పాల్పడ్డారు. (వీడియో 👇👇)



ఇంటి యజమానుల కథనం ప్రకారం, సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 120 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. శుభకార్యాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారుసం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గ్రామంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీస్ దళాలు గస్తీ పెంచాలని కోరుతున్నారు.




Post a Comment

Previous Post Next Post