Top News

Basara | బాసర గోదావరిలో ముగ్గురి గల్లంతు

బాసర గోదావరిలో ముగ్గురి గల్లంతు

ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు

తెలంగాణ డైలీ న్యూస్, నిర్మల్:

నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి స్నానానికి వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కాచిగూడ చప్పల్ బజార్ కు చెందిన కుటుంబం అమ్మవారి దర్శనానికి వచ్చారు. గోదావరిలో స్నానం చేసేందుకు ముగ్గురు అన్నదమ్ములు చంద్ర శేఖర్(38), రామచందర్ (36), మల్లేష్ కుమార్ (31) గోదావరిలో దిగారు. ఐతే లోతు అంచనా వేయలేక పోవటం వల్ల వారు నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన సమాచారం అనంతరం బాసర పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తమ కళ్ళముందే నీటిలో కొట్టుకుపోవటంతో వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.

Post a Comment

Previous Post Next Post