Top News

Paddy | వరి లోడ్ తీసుకోని రైస్ మిల్లర్.. రైతులకు ఇబ్బందులు

 


వరి లోడ్ తీసుకోని రైస్ మిల్లర్.. రైతులకు ఇబ్బందులు  

సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ ముందు ధర్నా: రైతుల హెచ్చరిక  

తెలంగాణ డైలీ న్యూస్, మాచారెడ్డి, జూన్ 9: పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామంలో వరి కొనుగోలు చేసిన తర్వాత రైస్ మిల్లర్ లారీ లోడ్ తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం డ్యామేజ్ అయిందని సాకు చెబుతూ మిల్లుకు చెన్నై పంపించడం లేదని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.  

విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సబ్బిడి రమేష్, టీఆర్‌పీ కామారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ ఆరెపల్లి గ్రామానికి చేరుకున్నారు. రైతులు, రైస్ మిల్లర్, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.  

రైస్ మిల్లర్ వైఖరితో పంట చేతికందక, డబ్బులు రాక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారని టీఆర్‌పీ నేతలు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రేపు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని రైతులు హెచ్చరించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.



Post a Comment

Previous Post Next Post