Collector | యూరియా కోసం మొబైల్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి

యూరియా కోసం మొబైల్ యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి  

పోతాయిపల్లిలో రైతులకు కలెక్టర్ సూచన  

పారదర్శక పంపిణీకి ప్రత్యేక చర్యలు  

శాస్త్రీయ సాగుపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అవగాహన

తెలంగాణ డైలీ న్యూస్,కామారెడ్డి, జూన్ 16: రైతులు మొబైల్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకొని యూరియా ఎరువులను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

మంగళవారం లింగంపేట మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

యూరియా పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం కోసం అమలు చేస్తున్న మొబైల్ యాప్ ద్వారా రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. దీంతో రద్దీ తగ్గడంతో పాటు రైతులు నిర్ణీత సమయంలో ఎరువులు పొందగలరని తెలిపారు.

మొబైల్ యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంటల దిగుబడిని పెంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎంఎస్‌వో, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఏఈ ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారులు, ఎంఈవో, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post