Top News

TGTWREIS | గిరిజన గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు


•గిరిజన గురుకులాల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు 

•16న కామారెడ్డిలో బాలురకు, 18న ఎల్లారెడ్డిలో బాలికలకు కౌన్సెలింగ్  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి:

గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రీజనల్ కోఆర్డినేటర్ గంగారామ్ నాయక్ ప్రకటన విడుదల చేశారు.

బాలురకు 16న, బాలికలకు 18న కౌన్సెలింగ్  

ఈనెల 16న కామారెడ్డి పట్టణంలోని సరంపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న నాగిరెడ్డిపేట జూనియర్ కళాశాలలో బాలురకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 18న ఎల్లారెడ్డి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో బాలికలకు కౌన్సెలింగ్ చేపడతారు.

ఉదయం 10 గంటలకల్లా హాజరుకావాలి  

మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 2025-26లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉదయం 10 గంటలకల్లా కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరుకోవాలని కోఆర్డినేటర్ సూచించారు.

తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు  

విద్యార్థులు టీసీ, బోనఫైడ్, కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు ఒరిజినల్స్ తీసుకురావాలి.

మెరిట్ ఆధారంగా సీట్లు  

మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకంగా సీట్ల కేటాయింపు చేపడతామని రీజనల్ కోఆర్డినేటర్ గంగారామ్ నాయక్ తెలిపారు.



Post a Comment

Previous Post Next Post